Abn logo
Jun 14 2021 @ 13:18PM

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల హల్‌చల్

శ్రీకాకుళం: జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. భామిని మండలం ఘనసర, కొసలి, తాలాడ గ్రామాల్లో ఏనుగులు తిష్టవేశాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల హల్‌చల్‌పై అటవీశాఖ అధికారులకు పలుమార్లు చెప్పినా ఏనుగులను తరలించడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.