Shar: వచ్చే రెండు మాసాల్లో రెండు ప్రయోగాలు: రాజరాజన్‌

ABN , First Publish Date - 2022-08-16T01:39:12+05:30 IST

వచ్చే రెండు మాసాల్లో షార్‌ నుంచి ప్రయోగించేందుకు రెండు రాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌ (Shar Director A. Rajarajan) వెల్లడించారు.

Shar: వచ్చే రెండు మాసాల్లో రెండు ప్రయోగాలు: రాజరాజన్‌

శ్రీహరికోట: వచ్చే రెండు మాసాల్లో షార్‌ నుంచి ప్రయోగించేందుకు రెండు రాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌ (Shar Director A. Rajarajan) వెల్లడించారు. షార్‌ కేంద్రీయ పాఠశాల ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం షార్‌ భాస్కర అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరులో ప్రయోగించేందుకు పీఎస్‌ఎల్వీ-సీ54 రాకెట్‌, అక్టోబరులో ప్రయోగించేలా జీఎస్‌ఎల్వీ-మార్క్‌3 రాకెట్‌ అనుసంధానాలు షార్‌లో పూర్తికానున్నాయన్నారు. ఈ నెలలో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ1 రాకెట్‌ విఫలంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని, మార్పులతో ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ2 ప్రయోగం త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే గగనయాన్‌ ప్రయోగానికి రిహార్సల్స్‌గా రెండు మానవ రహిత రాకెట్లను ప్రయోగించే సన్నాహాలు చేస్తామన్నారు. అలాగే పీఎస్‌ఎల్వీ-సీ55, 56, సూర్యశోధనకు ఆదిత్య-ఎల్‌1 చంద్రునిపైకి చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు రాజరాజన్‌ చెప్పారు.

Updated Date - 2022-08-16T01:39:12+05:30 IST