Srihari Nataraj: ఫైనల్‌కు శ్రీహరి నటరాజ్.. రికార్డుకు అడుగు దూరంలో..

ABN , First Publish Date - 2022-07-30T21:28:58+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు దుమ్మురేపిన ఆటగాళ్లు

Srihari Nataraj: ఫైనల్‌కు శ్రీహరి నటరాజ్.. రికార్డుకు అడుగు దూరంలో..

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు దుమ్మురేపిన ఆటగాళ్లు రెండో రోజూ శుభారంభం చేశారు. స్విమ్మర్ శ్రీహరి నటరాజ్(Srihari Nataraj) సెమీఫైనల్‌ బ్యాక్‌స్ట్రోక్‌‌ 100 మీటర్ల విభాగంలో 54.55 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 21 ఏళ్ల నటరాజ్ సెమీస్‌ను తన హీట్‌లో నాలుగో స్థానంలో ముగించాడు. ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్  పోరులో భారత్‌కు పతకం అందించేందుకు సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోయెట్జ్ సెమీస్‌లో అత్యంత వేగవంతమైన స్విమ్మర్‌గా నిలిచాడు. తొలి రోజు అతడు 53.67 సెకన్లలోనే పూర్తి చేశాడు. 


ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నటరాజ్ విజయం సాధిస్తే కామన్వెల్త్‌లో ఆ ఘనత సాధించిన రెండో భారత స్విమ్మర్‌గా రికార్డులకెక్కుతాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రశాంత కర్మాకర్ (Prasanta Karmakar) పారా స్విమ్మింగ్ ఈవెంట్‌లో కాంస్యం సొంతం చేసుకున్నాడు.  గతేడాది జరిగిన టోక్కో ఒలింపిక్స్‌లో క్లాసిఫికేషన్ హీట్‌లో స్విమ్ చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో 54:31 సెకన్లలో పూర్తిచేసి 27వ స్థానంలో నిలిచాడు.


అంతకుముందు 400 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్‌లో కుషరంగ రావత్ (Kushagra Rawat) సెమీఫైనల్‌ పోరులో విఫలమయ్యాడు. 3:57.45 సెకన్లలో పూర్తిచేసి ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. అలాగే, 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సాజన్ ప్రకాశ్ (Sajan Prakash) కూడా నిరాశపరిచాడు. 25.01 సెకన్లలో పూర్తిచేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Updated Date - 2022-07-30T21:28:58+05:30 IST