కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ప్రజల కోసమే

ABN , First Publish Date - 2020-03-29T10:02:27+05:30 IST

కరోనా కట్టడికి పోలీసులు తీసుకునే చర్యలు ప్రజల కోసమేనని గుర్తించాలని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ ఎన్‌.శ్రీధర్‌రావు అన్నారు.

కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ప్రజల కోసమే

రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ శ్రీధర్‌రావు


నంద్యాల (నూనెపల్లె), మార్చి 28:  కరోనా కట్టడికి పోలీసులు తీసుకునే చర్యలు ప్రజల కోసమేనని గుర్తించాలని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ ఎన్‌.శ్రీధర్‌రావు అన్నారు. శనివారం నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సహకారంతో నంద్యాల పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు 10 వేల హ్యాండ్‌ శానిటైజర్ల పంపిణీ చేశారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డితో పాటు రాష్ట్ర అడిషినల్‌ డీజీపీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప   హాజరయ్యారు.


ఈ సందర్భంగా అడిషనల్‌ డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటి సారిగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. కరోనా కట్టడికి, సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పని చేయడాన్ని ప్రజలు గుర్తించి సహకరించాలని  కోరారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ప్రజలు బాధ్యతగా తీసుకొని ఇళ్ళల్లోనే ఉండాలన్నారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు కరోనా కట్టడికి పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ గతంలో నంద్యాల పట్టణాన్ని సేఫ్‌ సీటీగా మార్చేందుకు సీసీ కెమోరాల ఏర్పాటుకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పోలీస్‌ శాఖకు సహాయ సహకారాలు అందించారని, అదే విధంగా కరోనా నివారణ కోసం 10 వేల  శానిటైజర్లను అందజేయడం అభినందనీయమన్నారు.


ప్రజలందరూ లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ చిదానందరెడ్డి, నంద్యాల పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోని సీఐలు,  ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.  


నంద్యాల (ఎడ్యుకేషన్‌):  కరోనా మహమ్మారిపై ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం బాలాజీ కాంప్లెక్స్‌లోని ఆర్యవైశ్య సంఘం నాయకులు కండే శ్యామ్‌సుందర్‌లాల్‌, కండే ఆనంద్‌గురుజీ, బింగుమళ్ళ శ్యామ్‌సుందర్‌గుప్తా ఆదర్శ నగర్‌లోని వివిధ ప్రాంతాలలో శానిటైజర్లను, మాస్క్‌లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో బాష, అషుతోష్‌, మహమ్మద్‌సాదు, వీరేంద్రనాథ్‌,  మౌలాసాయి, హేమశేషు, తదితరులు పాల్గొన్నారు. 


 శానిటైజర్ల పంపిణీ 

ఉయ్యాలవాడ, మార్చి 28: నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆర్థిక సహాయంతో మండల ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేస్తున్నామని మండల వైసీపీ నాయకుడు పోచా రాధాక్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయా గ్రామాల వలంటీర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


సి.బెళగల్‌: మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే దాత సి.బెళగల్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి, కొండాపురం గ్రామస్థులకు శానిటైజర్లు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి రంగస్వామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివశంకర్‌ నాయక్‌, ఎంపీడీవో రాముడు, ఎస్‌ఐ పవన్‌కుమార్‌ ఉన్నారు. 


Updated Date - 2020-03-29T10:02:27+05:30 IST