Agnipathపై దేశం మొత్తం వ్యతిరేకత ఉంది: Sridhar Babu

ABN , First Publish Date - 2022-06-19T20:52:26+05:30 IST

అగ్నిపథ్‌పై దేశం మొత్తం వ్యతిరేకత ఉందని, ఆర్మీని రక్షించుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

Agnipathపై  దేశం మొత్తం వ్యతిరేకత ఉంది: Sridhar Babu

Hyderabad: అగ్నిపథ్‌ (Agnipath)పై దేశం మొత్తం వ్యతిరేకత ఉందని, ఆర్మీ (Army)ని రక్షించుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  సేవ్ ఆర్మీ పేరుతో ముందుకు పోవాలన్నారు. ఆర్మీలోకి వెళ్ళాలనుకునే యువతకు గత రెండు సంవత్సరాలుగా నిరాశే మిగిలిందన్నారు. ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సోల్జర్‌ను తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అగ్నిపథ్‌లో 75 శాతం మందిని ఇంటికి పంపిస్తే.. వాళ్లు ఏం చేయాలని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మీ ద్వారా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చారని, సైనికులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని శ్రీధర్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-19T20:52:26+05:30 IST