May 11 2021 @ 09:26AM

సుధీర్ బాబు బర్త్ డే స్పెషల్.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్

మంగ‌ళ‌వారం(మే 11) హీరో సుధీర్‌బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న‌ శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్ర యూనిట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది. ఈ సినిమాలో సూరి బాబు అనే లైటింగ్ బాయ్ పాత్ర‌లో సుధీర్ క‌నిపించ‌నున్నారు. ఆ పాత్ర‌కు సంబంధించిన ఎలివేష‌న్ చేసేలా గ్లింప్స్ ఉంది. ఈ సినిమాలో ప‌డ‌వ పందెంకు సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఉన్నాయని గ్లింప్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. తిరునాళ్ల‌లో హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా ఇందులో మ‌నం చూడొచ్చు. సినిమాలో సుధీర్ సిక్స్ ప్యాక్ బాడీతో అల‌రించ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. మ‌రి సినిమాను ఎంజాయ్ చేయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ప‌లాస ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌లే మంచి రోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర చిత్రాల నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.