అతిలోక సుందరి శ్రీదేవి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ తార 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ హోటల్ బాత్‌టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ నటి భర్త, బిజినెస్ మ్యాన్ బోనీ కపూర్ వీలు దొరికినప్పుడల్లా ఆమెను మిస్ అవుతున్నట్లు తన ప్రేమను వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. తాజాగా 24 ఏళ్ల క్రితంది అయిన ఓ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
శ్రీదేవి, బోని కపూర్ 1998లో అలాస్కాలో జరిగిన తమ మేనల్లుడు పెళ్లికి వెళ్లారు. అప్పుడు వీరిద్దరు కలిసి తీయించుకున్న ఓ ఫోటోని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దానికి అలాస్కా 1998 అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ పిక్‌లో శ్రీదేవి కోటు, స్కార్ఫ్ వేసుకొని నవ్వుతూ బోనీని కౌగిలించుకొని ఉంది. కాగా, 1996లో బిజినెస్ మ్యాన్ బోనీ కపూర్ వివాహం చేసుకోగా వారికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానంగా కలిగారు.