Jul 9 2021 @ 23:15PM

చిరంజీవి చేతుల మీదుగా...

సుధీర్‌బాబు హీరోగా ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీదేవి గోలీసోడా సెంటర్‌’. ఇందులోని ‘మందులోడా... ఓరి మాయలోడా’ పాటను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మణిశర్మ స్వరకల్పనలో ఉత్తరాంధ్ర జానపద గీతాల స్ఫూర్తితో కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను సాహితి చాగంటి, ధనుంజయ ఆలపించారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోందీ పాట. ‘మందులోడా... మాస్‌ కా బాస్‌’కు విపరీతమైన స్పందన లభిస్తోంది. పాటను విడుదల చేసిన చిరంజీవి గారికి థ్యాంక్స్‌’’ అని నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి తెలిపారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగేంద్ర కాశీ కథారచయిత.