Abn logo
Aug 12 2020 @ 09:14AM

సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి.. అభిమానుల ఉద్యమం!

ద‌క్షిణాది, ఉత్త‌రాది చిత్రాల్లో న‌టించి నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి. నిర్మాత బోనీక‌పూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అందంలోనే కాదు.. న‌ట‌న‌లో ఎంద‌రికో ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన శ్రీదేవి 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో త‌న ఉన్న హోట‌ల్ రూం బాత్ ట‌బ్‌లో ప‌డి చ‌నిపోయారు. ఈమె మృతిపై ఆమె అభిమానులు చాలా మంది ఇంకా అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఆగ‌స్ట్ 13న శ్రీదేవి జయంతి.  ఈ సంద‌ర్భంగా శ్రీదేవి అభిమానులు నెట్టింట ఓ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంత‌కూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా? ‘సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి’. దాదాపు రెండున్న‌రేళ్ల త‌ర్వాత శ్రీదేవి అభిమానులు ఇలా సోష‌ల్ మీడియాలో ఇంత‌లా ర‌చ్చ చేయడానికి కార‌ణ‌మెవ‌రో తెలుసా?  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణంపై బాలీవుడ్‌లో పెనుదుమార‌మే రేగుతోంది. సుశాంత్ కేసును కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించింది. అలాంట‌ప్పుడు అనుమానాస్పదంగా దుబాయ్‌లో చ‌నిపోయిన శ్రీదేవి మ‌ర‌ణంపై ఎందుకు సీబీఐ విచార‌ణ చేయ‌లేదని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె అభిమానులు ఉద్య‌మం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement