ఏపీకి శ్రీసిటీ ఓ వరం

ABN , First Publish Date - 2021-04-13T07:03:14+05:30 IST

శ్రీసిటీ ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాష్ట్రానికి ఇచ్చిన పెద్ద వరమని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు.

ఏపీకి శ్రీసిటీ ఓ వరం
శ్రీసిటీ సందర్శనలో పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు

శ్రీసిటీ(వరదయ్యపాళెం), ఏప్రిల్‌ 12: శ్రీసిటీ ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాష్ట్రానికి ఇచ్చిన పెద్ద వరమని మంత్రి పెద్దిరెడ్డి కొనియాడారు. ఎన్నికల ప్రచార నిమిత్తం సత్యవేడు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు సోమవారం శ్రీసిటీని సందర్శించారు. ఆ సంస్థ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ప్రముఖులకు స్వాగతం పలికి శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి తదితర అంశాల గురించి వివరించారు. శ్రీసిటీ ఏర్పాటుతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో నిరుద్యోగ సమస్య తొలగిపోవాలని వైఎస్‌ ఆశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. అయితే రాష్ట్రం మొత్తానికి ఉపాధి కల్పించేస్థాయికి శ్రీసిటీ ఎదగడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T07:03:14+05:30 IST