హైదరాబాద్: నగరంలో నేడు శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు భజరంగదల్, బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్ర మధ్యాహ్నం12:30 గంటలకు మంగళ్‌హాట్ నుంచి బయలుదేరుతుంది. కొవిడ్ కారణంగా శోభాయాత్ర రెండేళ్లుగా వాయిదా పడింది. ఈ ఏడాది భారీస్థాయిలో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. లక్ష మందికిపైగా శోభాయాత్రలో పాల్గొంటారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రాత్రి 10గంటల వరకు పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.