ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

ABN , First Publish Date - 2021-04-21T05:28:01+05:30 IST

పట్టణంలోని ప్రసిద్ది చెందిన అతిపురాతన రామభద్రాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు
ఆలయంలో హోమాలు నిర్వహిస్తున్న వేద పండితులు

పెనుకొండ, ఏప్రిల్‌ 20: పట్టణంలోని ప్రసిద్ది చెందిన అతిపురాతన రామభద్రాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్చకులు రాజీవాచార్యులు, రామకృష్ణాచార్యులు స్ర్థీనిధి మధుసుధన ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11గంటల నుంచి హోమాలు, కలశారాధన, పూర్ణాహుతి, మహామంగళహారతి, కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రంలో ఆలయ కమిటీ సభ్యులు యాడికి నాగరాజు, బొక్సంపల్లి రామక్రిష్ణ, శ్రీకాంతరెడ్డి, ఎస్‌ఎ్‌సవై గురూ రవిశంకర్‌, పెనుకొండ సీఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, సాయంత్రం సీతారామ కల్యాణ మహోత్సవం,అఖండ భజన, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:28:01+05:30 IST