రాజీనామాకు Sri Lanka ప్రధాని Mahinda Rajapaksa అంగీకారం!

ABN , First Publish Date - 2022-05-07T19:35:43+05:30 IST

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా

రాజీనామాకు Sri Lanka ప్రధాని Mahinda Rajapaksa అంగీకారం!

కొలంబో : శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు, ఆర్థిక సంక్షోభం తీవ్రత నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలని ఆయనను దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స కోరారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని జాతీయ మీడియా చెప్తోంది. 


శ్రీలంక మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీలంక అధ్యక్షుడు Gotabaya Rajapaksa నేతృత్వంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహిందను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని గొటబయ కోరారు. అందుకు మహింద అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రధాని మహింద విఫలమైనందు వల్ల ఆ పదవి నుంచి ఆయన వైదొలగాలని కోరినట్లు శ్రీలంక కేబినెట్‌కు గొటబయ తెలిపారు. ఆయన రాజీనామా చేస్తే, కేబినెట్ కూడా రద్దవుతుంది. వేధిస్తున్న ఆర్థిక సంక్షోభానికి ఏకైక పరిష్కారం తన రాజీనామాయే అయితే అందుకు తాను సిద్ధమేనని మహింద చెప్పారు. మహింద రాజపక్స సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండటం వల్ల దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను పరిష్కరించడం పెను సమస్యగా మారిందని గొటబయ అంగీకరించారు. ఈ సంక్షోభం వల్ల దేశానికి యాత్రికులు రావడం లేదన్నారు. మరోవైపు ఫ్యాక్టరీల మూసివేత వల్ల ఇప్పటికే ఉన్న ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. 


ఇదిలావుండగా, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహింద రాజపక్స తీసుకున్న నిర్ణయంపై కేబినెట్ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని ప్రసన్న రణతుంగ, నలక గొడహెవ, రమేశ్ పథిరణ సమర్థిస్తుండగా, విమలవీర దిస్సనాయకే మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 


Read more