వైరల్: కరువొచ్చిందంటూ..కొబ్బరి చెట్టెక్కిన మంత్రి!

ABN , First Publish Date - 2020-09-19T20:22:05+05:30 IST

శ్రీలంకలో కొబ్బరి కాయల కరువొచ్చింది.. ప్రస్తుతం అక్కడ 70 కోట్ల కొబ్బరి కాయలు అదనంగా కావాలి! ప్రస్తుతమున్న సరఫరా.. పారిశ్రామిక అవసరాలకు కూడా సరిపోవడం లేదు. దీనికి పరిష్కారం కొబ్బరి సాగును పెంచడమే. మరి ఈ దిశగా ప్రజల్ని ప్రోత్సహించి సమస్య తీవ్రతను వారికి అర్థమయ్యేలా చేయాలంటే ఏం చేయాలి..? శ్రీలంకకు చెందిన కొబ్బరికాయల శాఖ మంత్రికి కూడా సరిగ్గా ఇదే ప్రశ్నకు వేసుకున్నారు.

వైరల్: కరువొచ్చిందంటూ..కొబ్బరి చెట్టెక్కిన మంత్రి!

కొలొంబో:  శ్రీలంకలో కొబ్బరి కాయల కరువొచ్చింది.. ప్రస్తుతం అక్కడ 70 కోట్ల కొబ్బరి కాయలు అదనంగా కావాలి! ప్రస్తుతమున్న సరఫరా.. పారిశ్రామిక అవసరాలకు కూడా సరిపోవడం లేదు. దీనికి పరిష్కారం కొబ్బరి సాగును పెంచడమే. మరి ఈ దిశగా ప్రజల్ని ప్రోత్సహించి సమస్య తీవ్రతను వారికి అర్థమయ్యేలా చేయాలంటే ఏం చేయాలి..? శ్రీలంకకు చెందిన కొబ్బరికాయల శాఖ మంత్రికి కూడా సరిగ్గా ఇదే ప్రశ్నకు వేసుకున్నారు. 


ఇందుకు సమాధానంగా.. ఆయన స్వయంగా కొబ్బరి చెట్టెక్కి.. సమస్య తీవ్రత ప్రజల మెదళ్లోకి ఇంకేలా మాంచి ఉపన్యాసం దంచారు. ‘అందుబాటులో ఉన్న ప్రతి సెంటు భూమి కూడా కొబ్బరి సాగుకు మళ్లించాలి. కబ్బరి కాయల ఉత్పత్తిని పెంచి విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోవాలి’ అంటూ ఆయన చెట్టుపై నుంచి ఉప దేశించారు. తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం ఆకాశాన్నంటిన కొబ్బరి కాయల రేట్లను తగ్గించేందుకు పూనుకుందని కూడా ఆయన తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. చెట్టెక్కేందుకు ఉపయోగపడే సాధనం నుంచి మంత్రిని విడిపించేందుకు సిబ్బందికి తల ప్రాణం తొకకు వచ్చిందని సమాచారం.

Updated Date - 2020-09-19T20:22:05+05:30 IST