Advertisement
Advertisement
Abn logo
Advertisement

Sri Lanka vs India: టాస్ గెలిచిన శ్రీలంక

కొలంబో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య నేడు రెండో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసన్ షనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే వికెట్ బెటర్‌గా ఉండడంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు దాసన్ పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో ఆరంభం, ముగింపు బాగానే ఉన్నప్పటికీ మిడిల్ ఓవర్లలో మరింత బాగా ఆడాల్సి ఉందన్నాడు. ఉడానా స్థానంలో కసున్ రజిత జట్టులోకి వచ్చాడు. 


శిఖర్ ధవన్ మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. గత మ్యాచ్‌లో బౌలర్లు చక్కగా రాణించారని, ప్రత్యర్థిని 260 పరుగులకే కట్టడి చేశారని పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement