జడ్డూ విజృంభణ.. శ్రీలంక 174 ఆలౌట్.. 400 పరుగుల ఆధిక్యంలో భారత్

ABN , First Publish Date - 2022-03-06T16:54:33+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు ఆలౌండర్ షోతో అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్‌లో రాణించిన రోహిత్ సేన ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భళా అనిపించింది.

జడ్డూ విజృంభణ.. శ్రీలంక 174 ఆలౌట్.. 400 పరుగుల ఆధిక్యంలో భారత్

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు ఆలౌండర్ షోతో అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్‌లో రాణించిన రోహిత్ సేన ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భళా అనిపించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లంక జట్టు కేవలం 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి లంకేయుల వెన్ను విరిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 108/4తో మూడో రోజు ఆట ఆరంభించిన శ్రీలంక లంచ్ సమయానికి ముందే మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో నిస్సాంక (61 నాటౌట్) ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ కరుణరత్నే(28), అసలంక(29), మాథ్యూస్(22) పరుగులు చేశారు. లక్మల్, ఎంబుల్డెనియా, ఫెర్నాండో, లాహిరు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా.. బుమ్రా, అశ్విన్ తలో రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జడ్డూ బ్యాటింగ్(175 నాటౌట్)తో పాటు బౌలింగ్(5వికెట్లు)లోనూ విజృంభించాడు. జడ్డూ ఆల్‌రౌండర్ షోతో టీమిండియా తొలి టెస్టులో మూడో రోజే శాసించే స్థాయికి చేరింది.      

Updated Date - 2022-03-06T16:54:33+05:30 IST