Advertisement
Advertisement
Abn logo
Advertisement

సూపర్‌-12కు శ్రీలంక

  • ఐర్లాండ్‌పై గెలుపు

అబుధాబి: ప్రపంచ కప్‌ తొలి రౌండ్‌లో రెండో విజయం సాధించిన శ్రీలంక గ్రూప్‌ ‘ఎ’ నుంచి సూపర్‌-12 స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ గ్రూప్‌లో నెదర్లాండ్స్‌ తదుపరి దశ అవకాశాలు గల్లంతు కాగా..శుక్రవారం నమీబియా-ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ విజేత గ్రూప్‌ ‘ఎ’ నుంచి రెండో జట్టుగా సూపర్‌-12కు క్వాలిఫై అవుతుంది. ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులతో ఐర్లాండ్‌ను లంక ఓడించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్‌ 18.3 ఓవర్లలో 101 రన్స్‌కే అలౌటైంది. కెప్టెన్‌ బాల్‌బిర్నీ (41) టాప్‌ స్కోరర్‌. క్యాంఫెర్‌ (24) పర్లేదనిపించాడు. అంతకుముందు టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక..పేసర్‌ లిటిల్‌ ధాటికి 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్‌ నిసాంక, హసరంగ డిసిల్వా ఒత్తిడికి లోనవకుండా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 123 రన్స్‌ జత చేసి పరిస్థితి చక్కదిద్దారు. ఈ జోడి ఽధాటికి 7-15 ఓవర్ల మధ్య 80 పరుగులు రావడం విశేషం. కెప్టెన్‌ షణుక 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 


సంక్షిప్తస్కోర్లు: 

శ్రీలంక: 20 ఓవర్లలో 171/7 (హసరంగ 71, నిసాంక 61, జోష్‌ లిటిల్‌ 4/23).

ఐర్లాండ్‌: 18.3 ఓవర్లలో 101 (బాల్‌బర్నీ 41, క్యాంఫెర్‌ 24, తీక్షణ 3/17, లాహిరు 2/22, కరుణరత్నే 2/27).

Advertisement
Advertisement