శ్రీలంక ఘనవిజయం

ABN , First Publish Date - 2021-11-26T10:16:38+05:30 IST

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో శ్రీలంక జట్టు 187 పరుగుల భారీతేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది.

శ్రీలంక ఘనవిజయం

గాలె: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో శ్రీలంక జట్టు 187 పరుగుల భారీతేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. 29 నుంచి రెండో టెస్టు జరుగుతుంది. 348 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభిం చిన విండీస్‌ ఆఖరిరోజైన గురువారం 160 రన్స్‌కే కుప్ప కూలింది. బానర్‌ (68 నాటౌట్‌), జోషువా (54) రాణించినా ఫలితం లేకపోయింది. ఎంబుల్డె నియా 5 వికెట్లతో రాణించాడు. 

Updated Date - 2021-11-26T10:16:38+05:30 IST