Sri Lanka ప్రధాని Rajapaksa రాజీనామా

ABN , First Publish Date - 2022-05-09T21:38:08+05:30 IST

కొలంబో: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు.

Sri Lanka ప్రధాని Rajapaksa రాజీనామా

కొలంబో: Sri Lanka ప్రధాని Mahinda Rajapaksa  రాజీనామా చేశారు. ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం రాజపక్స పేరిట ప్రకటన వెలువడింది. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఆర్ధిక సంక్షోభానికి  త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజపక్స ఆశాభావం వ్యక్తం చేశారు. 





ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రో ధరలతో దేశ ప్రజలు నిరసనలకు దిగారు. అయితే తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది. 


మరోవైపు కొలంబోలో అధ్యక్ష భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు, ప్రభుత్వ అనుకూల వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఘటనలో 20 మంది గాయపడ్డారు. కొలంబోలో భారీగా బలగాలను మోహరించారు. కర్ఫ్యూ కొనసాగుతోంది. 

Read more