కొవిడ్ ఎఫెక్ట్.. శ్రీలంక కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-05-14T21:34:16+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారెంటైన్‌ను తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చే శ్రీలంక పౌరులకు కూడా ఈ నిబం

కొవిడ్ ఎఫెక్ట్.. శ్రీలంక కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారెంటైన్‌ను తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చే శ్రీలంక పౌరులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న వారు సైతం దీన్ని పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతేకాకుండా శ్రీలంకకు చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. క్వారెంటైన్ పీరియడ్ పూర్తి చేసుకున్న అనంతరం ప్రయాణికులందరూ మరోసారి టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. కాగా.. గడిచిన 24 గంటల్లో శ్రీలంకలో దాదాపు 3వేల మంది కొవిడ్ బారినపడగా సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 1.35లక్షలకు చేరగా 892 మంది ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవతున్న కారణంగా భారత్ నుంచి రాకపోకలపై శ్రీలంక నిషేధం విధించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-05-14T21:34:16+05:30 IST