లంక వైట్‌వాష్‌

ABN , First Publish Date - 2021-01-26T08:32:19+05:30 IST

ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక 0-2తో వైట్‌వాష్‌ అయింది. రెండు, ఆఖరి టెస్ట్‌లో.. మరో రోజు మిగిలుండగానే ఇంగ్లండ్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో చిత్తయింది...

లంక వైట్‌వాష్‌

  • 2-0తో టెస్ట్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం
  • రెండో మ్యాచ్‌లో 6 వికెట్లతో గెలుపు

గాలె: ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక 0-2తో వైట్‌వాష్‌ అయింది. రెండు, ఆఖరి టెస్ట్‌లో.. మరో రోజు మిగిలుండగానే ఇంగ్లండ్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో చిత్తయింది. ఆటకు నాలుగో రోజైన సోమవారం లంక నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఓపెనర్‌ సిబ్లే (56 నాటౌట్‌), బట్లర్‌ (46 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 164/4 స్కోరు చేసి నెగ్గింది. స్పిన్నర్‌ ఎంబుల్డినియా (3/73) మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. 37 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంక 126 పరుగులకే కుప్పకూలింది. స్పి  న్నర్లు బెస్‌ (4/49), లీచ్‌ (4/59) చెరో నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 381 పరుగులు చేసింది. లంకలో ఇంగ్లండ్‌కిది వరుసగా ఆరో గెలుపు  కాగా.. రూట్‌ కెప్టెన్సీలో ఐదోది. ఈ క్రమంలో లంకగడ్డపై అత్యధికంగా ఐదు విజయాలు నమోదు చేసిన విదేశీ సారథి విరాట్‌ సరసన రూట్‌ నిలిచాడు. 


Updated Date - 2021-01-26T08:32:19+05:30 IST