ఇస్కాన్‌లో నేటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2022-08-18T06:22:51+05:30 IST
ఇస్కాన్ సాగర్‌నగర్ మందిర ప్రాంగణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజులు పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు సాంబదాస్ తెలిపారు
మహారాణిపేట, ఆగస్టు 17: ఇస్కాన్ సాగర్‌నగర్ మందిర ప్రాంగణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజులు పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు సాంబదాస్ తెలిపారు. బుధవారం హోటల్ దసపల్లా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. ఉత్సవాలలో రాధాకృష్ణుల అలంకరణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. 51 రకాల సగంధ ద్రవ్యాలతో విశేషమైన మహా అభిషేకం, 108 దీపాలతో మహాదీప హారతి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతాజీ నితాయిసేవిని, ఎంవీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.