శ్రీచైతన్య పాఠశాల పుస్తకాలు సీజ్‌

ABN , First Publish Date - 2022-07-02T05:04:43+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న సిద్దిపేట పట్టణ పరిధిలోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన పుస్తకాలను డీఈవో ఆదేశాల మేరకు సిద్దిపేట అర్బన్‌ మండల విద్యాధికారి యాదవరెడ్డి శుక్రవారం సీజ్‌ చేశారు.

శ్రీచైతన్య పాఠశాల పుస్తకాలు సీజ్‌

సిద్దిపేట అర్బన్‌, జూలై 1: నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న సిద్దిపేట పట్టణ పరిధిలోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన పుస్తకాలను డీఈవో ఆదేశాల మేరకు సిద్దిపేట అర్బన్‌ మండల విద్యాధికారి యాదవరెడ్డి శుక్రవారం సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా పుస్తకాలు ప్రింట్‌ చేసి అమ్ముతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పట్టణ పరిధిలోని రంగధాంపల్లిలోని ఓ ఇంట్లో శ్రీచైతన్య పాఠశాలకు చెందిన పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ విక్రయిస్తున్నారని సమాచారం తెలియగా.. అక్కడికి చేరుకుని చూడగా నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నందున ఆ ఇంటిని సీజ్‌ చేసినట్లు తెలిపారు. సీజ్‌ తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-07-02T05:04:43+05:30 IST