IPL 2022: లక్నోపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ABN , First Publish Date - 2022-04-05T00:41:21+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2022: లక్నోపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ముంబై: లక్నో సూపర్ జెయింట్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయంతో రెండు పాయింట్లు సాధించగా, ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిన హైదరాబాద్ ఇంకా ఖాతా తెరవలేదు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, లక్నోలో మాత్రం ఓ మార్పు చోటుచేసుకుంది. చమీర స్థానంలో హోల్డర్‌కు తుది జట్టులో స్థానం లభించింది.

Updated Date - 2022-04-05T00:41:21+05:30 IST