Jun 22 2021 @ 14:00PM

మూడు చిత్రాల్లో అవకాశం దక్కించుకున్న శ్రీతారావు

సాధారణంగా సిని పరిశ్రమకు పరిచయమయ్యే నటి ఒక చిత్రంలో అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. ఒక వేళ అవకాశం దక్కినా ఆ సినిమా షూటింగును పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత నటనతో అందచందాలు బాగుంటేనే మరో చిత్ర అవకాశం వస్తుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం పరిచయంలోనే ఏకంగా మూడు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆమె పేరు శ్రీతారావు. వెండితెరకు పరిచయం అవుతూనే ఏకంగా మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హైదరా బాద్‌కు చెందిన ఈ భామ... విద్యాభ్యాసం కోసం చెన్నై వచ్చి సెటిల్‌ అయ్యింది. అయితే, నటనపై అమితమైన ప్రేమ ఉండటంతో తనకు తెలిసిన వారి ద్వారా సినిమాల్లో ఛాన్సుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఇవి ఫలిండచడంతో ఆమెకు సినిమా అవకాశాలు లభించాయి. ఈమె నటించిన తొలి చిత్రం ‘గుంకీ-2’. ప్రభు సాల్మాన్‌ దర్శకత్వం వహిం చారు. ఈ చిత్రం కోసం దాదాపు వంద మంది వరకు అడిషన్స్‌ చేసిన తర్వాత దర్శకుడు ప్రభు.. చివరకు శ్రీతారావును ఎంపిక చేశారు. ఆ తర్వాత విధార్థ్‌తో కలిసి ‘ఆట్రల్‌’ అనే చిత్రంలోనూ, మిషికన్‌ దర్శకత్వంలో తెరెకెక్కు త్ను ‘పితా’ అనే అనే చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రాలన్నీ వరుసగా విడుదలకానున్నాయి.