పార్కింగ్‌ ప్రదేశాల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-25T05:00:40+05:30 IST

శ్రీశైలం క్షేత్రంలో మార్చి 4 నుంచి 14 వరకు జరిగే మహ శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా బుధవారం క్షేత్ర పరిధిలోని పలు పార్కింగ్‌ ప్రదేశాలను ఈవో కేఎస్‌ రామరావు పరిశీలించారు.

పార్కింగ్‌ ప్రదేశాల పరిశీలన
పార్కింగ్‌ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఈవో, అధికారులు

శ్రీశైలం, ఫిబ్రవరి 24: శ్రీశైలం క్షేత్రంలో మార్చి 4 నుంచి 14 వరకు జరిగే మహ శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా బుధవారం క్షేత్ర పరిధిలోని పలు పార్కింగ్‌ ప్రదేశాలను ఈవో కేఎస్‌ రామరావు పరిశీలించారు. యజ్ఞవాటిక వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు, కర్ణాటక బస్సులకు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. అదేవిధంగా ఘంటామఠం వెనుక భాగాన, యజ్ఞవాటిక వద్ద, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, దేవస్థానం ఆగమ పాఠశాల ఎదురు ప్రాంతాలలో కార్‌ పార్కింగ్‌ ప్రదేశాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవో మాట్లాడుతూ పార్కింగ్‌ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభమైన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను వేగవంతం చేయాలని, బండరాళ్ళను తొలగించి చదును చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం వచ్చే వాహణదారులకు పార్కింగ్‌ ప్రదేశాలను సూచించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.  ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, ఉద్యానవన అధికారి లోకేష్‌, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:00:40+05:30 IST