'తానా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీనివాస గోగినేని పోటీ

ABN , First Publish Date - 2021-01-02T21:52:11+05:30 IST

త్వరలో జరగనున్న తానా ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీనివాస గోగినేని పోటీ చేస్తున్నారు.

'తానా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీనివాస గోగినేని పోటీ

త్వరలో జరగనున్న తానా ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీనివాస గోగినేని పోటీ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన తానాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వివిధ 'తానా' కార్యక్రమాల్లో పాల్గొంటూ, 12 సంవత్సరాలకుపైగా అనేక కీలక పదవులు విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఆయన అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2015-17 మధ్య కాలంలో 'తానా ఫౌండేషన్ చైర్మన్'గా ఆయన చేసిన సేవలను అమెరికాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ చాలా మంది ప్రశంసిస్తుంటారు. ఇక అమెరికాలోని సుమారు 20 రాష్ట్రాల్లో "మన ఊరికోసం" నినాదంతో మొదలుపెట్టిన '5కే రన్స్' కార్యక్రమాల ద్వారా 'తానా' సంస్థ సేవలపై ప్రత్యేక అవగాహనా కల్పిస్తూ కోట్లాది రూపాయలను సమీకరించారు. 


ఆ నిధులను తెలుగు రాష్ట్రాల్లో "చైతన్య స్రవంతి" కార్యక్రమం ద్వారా కంటి చూపు క్యాంపులు, కాన్సర్ నివారణ క్యాంపులు, డిజిటల్ మరియు పుస్తక లైబ్రరీలు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్షిప్‌లు, వారధి ద్వారా అనేక మంది పిల్లలకు చదువులు మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక 'తానా' కాన్ఫరెన్స్ సెక్రటరీగా, 'తానా' బోర్డు మెంబర్‌గా, బైలాస్ కమిటీ తదితర పదవుల్లో సేవలందించారు. ఇప్పుడు కూడా 'తానా మనందరిదీ', 'కొత్త సంస్కరణలు, విలువల పరిరక్షణ', 'పెత్తందారి వ్యవస్థ, ధనస్వామ్యం, బేలట్ కలెక్షన్‌లను ఖండిద్దా' నినాదాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 'తానా'ను తిరిగి గర్వపడేలా చేయడంలో తనతోపాటు కలిసిరావాలని కోరుతూ సభ్యులందరికీ 'నూతన సంవత్సర శుభాకాంక్షలు' తెలియజేశారు. 

Updated Date - 2021-01-02T21:52:11+05:30 IST