Abn logo
Feb 25 2020 @ 16:12PM

అవును.. ప్రేమలో ఉన్నా: శ్రీముఖి

బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ఇటీవల `బిగ్‌బాస్-3`తో మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. వాళ్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.


`మీరు ప్రేమలో ఉన్నారా?` అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. `అవును` అని సమాధానం ఇచ్చింది. అలాగే `ఎవరైనా ముద్దుపెడతానంటే తిరస్కరించారా?` అని మరో వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. `అవును.. ముద్దు వద్దని చెప్పాను` అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే స్నేహితుడి నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని, పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలాగే అనుమతి లేకుండా పక్కవారి ఫోన్ చూడాల్సి వచ్చిందని, అది చాలా చెడ్డ అలవాటని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. 


Advertisement
Advertisement
Advertisement