Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 13:38:28 IST

Sree Vishnu: 'అల్లూరి' విడుదల తేదీ ఖరారు..

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అల్లూరి' (Alluri). తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలలో కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ మార్కెట్ సంపాదించుకున్నారు శ్రీ విష్ణు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ఉన్న చిత్రాలు ఈ హీరోకి మంచి క్రేజ్ తీసుకువచ్చి పెట్టాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా మినిమం గ్యారెంటీ హీరో అని ఇండస్ట్రీ వర్గాలలో పేరు తెచ్చుకున్నారు.

ఆయన ఇప్పుడు మరో విభిన్న కథా చిత్రం అల్లూరితో రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బెక్కెం బబిత సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు నిజాయతీగల పోలీసు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. నిజాయితీకి మారు పేరు అనేది చిత్రం ట్యాగ్ లైన్. ఇప్పటికే, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచారం చిత్రాలు సినిమాపై బాగానే అంచనాలను పెంచాయి. 

ఇక ఈ సినిమా టీజర్ చూస్తే యాక్షన్ ఎంటర్ టైనర్‌గా 'అల్లూరి' రాబోతుందని అర్థమవుతోంది. గతంలో ఎప్పుడూ శ్రీ విష్ణు ఇలాంటి పాత్రలో కనిపించలేదు. 'అల్లూరి'లో మాత్రం శ్రీ విష్ణు కంప్లీట్ మాస్ హీరోగా అలరించబోతున్నారు. అయితే, తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్‌ను వదిలారు. ఇందులో విష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement