Abn logo
Sep 20 2020 @ 23:04PM

శ్రీముఖి ‘ఓ.. వుమానియా‌’ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరితో అంటే..

Kaakateeya

సోషల్‌ మీడియాలో తప్ప యాంకర్‌ శ్రీముఖి బుల్లితెరపై ఈ మధ్య కాలంలో అస్సలు కనిపించలేదు. కొందరు యాంకర్స్‌తో కలిసి ఏవో షోలు ప్లాన్‌ చేస్తుందంటూ ఆ మధ్య వార్తలు రావడమే కానీ, వాటిపై కూడా సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆమె ఓ.. వుమానియా అంటూ రీసెంట్‌గా ఓ ప్రోమోతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఓ.. వుమానియా అనేది బుల్లితెరపై ప్రసారం కాబోతోన్న ఓ షో గా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీముఖి చేసిన ఓ పోస్ట్ చూస్తే.. ఈ షో యూట్యూబ్‌ కోసమని తెలుస్తుంది.

మహిళా సెలబ్రిటీలనే ఇంటర్వ్యూ చేసే టాక్‌ షో గా చెబుతూ.. మొదటి షో కి సంబంధించిన వివరాలను శ్రీముఖి తెలిసింది. తన మొదటి షో లో యాంకర్‌ సుమని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లుగా శ్రీముఖి తెలిపింది. ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా శ్రీముఖి పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో శ్రీముఖితో కలిసి, సుమ కూడా డ్యాన్స్ చేస్తుంది. మరి శ్రీముఖి కొత్తగా ట్రై చేస్తున్న ఈ షో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.


Advertisement
Advertisement