శ్రావణ పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2022-08-13T05:46:49+05:30 IST

శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమాలను నిర్వహించారు. ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు.

శ్రావణ పౌర్ణమి పూజలు
భీమవరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు

ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పూజలు 

భీమవరంటౌన్‌, ఆగస్టు 12 : శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమాలను నిర్వహించారు. ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. ఈవో వై.భద్రాజీ, చైౖర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు ధర్మకర్తలు పాల్గొన్నారు. గునుపూడి సోమేశ్వరస్వామి భక్తులకు శ్వేతవర్ణంలో దర్శనం ఇచ్చారు. పార్వతీ అమ్మవారికి, అన్నపూర్ణదేవికి కుంకుమ పూజలు చేసి అలంకరణ చేశారు. మెంటే వారితోటలో బాలాత్రిపురసుందరీ అమ్మవారి ఆలయంలో అర్చకుడు కొమ్ము శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు.  108 మంది మహిళలు పూజలు చేశారు. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వాసంశెట్టి చంద్రశేఖర్‌ భక్తులకు వెండి రూపులను అందించారు. 

వీరవాసరం : వీరవాసరం కనకదుర్గాంబ దేవస్థానంలో అమ్మవారికి పౌర్ణమి పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, అనంతరం హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో లలితా సహస్ర నామ పారాయణం చేశారు. కోట సత్తెమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి చలివిడి, పానకం నివేదించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గండి పోచమ్మ అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు నిర్వహించారు. 

ఆకివీడు : స్థానిక పెద్దింట్లమ్మ, వనువులమ్మ, గంగానమ్మ–మద్దిరావమ్మ, కనకదుర్గమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్శింహరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవస్థానాల మేనేజర్‌ సాగి గంగరాజు, బొమ్మారెడ్డి మాధవరెడ్డి, వైసీపీ నేతలు ఉన్నారు.

పాలకొల్లు అర్బన్‌ : స్థానిక యడ్ల బజారు కనకదుర్గమ్మ ఆలయంలో సుమా రు 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పాలపర్తి రామ లింగేశ్వరరావు, వెంకటలక్ష్మి, పాలపర్తి సురేష్‌వెంకటలక్ష్మి, రిషీకేష్‌  రామసాయి, మోక్షప్రణయ్‌, గుణ్ణం లక్ష్మీవేంకటేష్‌ నాయుడు, సుభాషిణి, కఠారి సుబ్బారావు, శేషవేణి, గనిశెట్టి సూర్యనారాయణ జ్ఞాపకార్ధం భార్య నాగమణి ఆర్థిక సాయంతో సుమారు రెండు వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ, శంభేశ్వర స్వామివారి ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. 

Updated Date - 2022-08-13T05:46:49+05:30 IST