Oct 11 2021 @ 19:09PM

‘సలార్’ లో ‘సాహో’ బ్యూటీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్., ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న భారీ యాక్షన్ మూవీ ‘సలార్’. బొగ్గుగనుల నేపథ్యంలో సాగే మాఫియా స్టోరీతో  ఈ సినిమా రూపొందనుంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను సంప్రదించారట దర్శకుడు. నిజానికి ఆ పాట కోసం కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని అనుకున్నారట. అయితే శ్రద్ధాకపూర్ అయితే రీచ్ ఎక్కువుంటుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక  చేయాలనుకుంటున్నారట. 


ఇక ‘సలార్’ చిత్రాన్ని ప్రభాస్ ఈ ఏడాది లోపుగానే పూర్తి చేయాలనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా కోసం ఆయన బల్క్ డేట్స్ ను కేటాయిస్తున్నారని టాక్.  హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో మాస్ ప్రేక్షకులకు ఐఫీస్ట్ నివ్వడానికి .. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను రంగంలోకి దింపారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల చేయబోతున్నఈ సినిమా కూడా ‘కేజీయఫ్’ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.