Saudi Arabia సంచలన నిర్ణయం.. ఆ నేరానికి రూ.2కోట్ల జరిమానా.. 15 ఏళ్ల జైలు!

ABN , First Publish Date - 2022-05-12T18:28:13+05:30 IST

చొరబాటుదారులకు సహకరించే వారిపై సౌదీ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది.

Saudi Arabia సంచలన నిర్ణయం.. ఆ నేరానికి రూ.2కోట్ల జరిమానా.. 15 ఏళ్ల జైలు!

రియాద్: చొరబాటుదారులకు సహకరించే వారిపై సౌదీ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఈ సందర్భంగా ఆ దేశ Public Prosecution హెచ్చరించింది. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. చొరబాటుదారులను సహకరించినట్లు నిర్ధారణ అయితే దోషులకు 1మిలియన్ సౌదీ రియాల్స్(రూ.2.06కోట్లు) జరిమానాతో పాటు 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. అలాగే చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తామని వెల్లడిచింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించి జరిమానాల విషయమై జారీ చేసిన 7/27/1442 నాటి Royal Order No. A/406తో పాటు 7/2/1443 నాటి రాయల్ ఆర్డర్ నం. 7975 ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుందని పేర్కొంది.    

Read more