మెయిల్స్‌పై స్పై

ABN , First Publish Date - 2022-08-06T06:00:27+05:30 IST

తప్పుడు పనులు చేసేందుకు మార్గాలు ఎక్కువ. అలా బైటపడ్డవాటిని ఒక పక్క మూసేస్తూ ఉంటే మరోవైపు కొత్త ద్వారాలు తెరుచుకోవడమే కాదు, ప్రాయోజితులపై

మెయిల్స్‌పై స్పై

తప్పుడు పనులు చేసేందుకు మార్గాలు ఎక్కువ. అలా బైటపడ్డవాటిని ఒక పక్క మూసేస్తూ ఉంటే మరోవైపు కొత్త ద్వారాలు తెరుచుకోవడమే కాదు, ప్రాయోజితులపై అక్రమార్కులు సవాళ్ళు విసురుతుంటాయి. మెయిల్స్‌పై గూఢచర్యానికి జీమెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా అక్రమార్కులు తిష్ట వేస్తున్నారు. గూగుల్‌ క్రోమ్‌ లేదా క్రోమ్‌ ఆధారిత మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఈమెయిల్స్‌పై  ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు హానికరమైన  గూఢచర్యం నెరుపుతున్నారని ఐఏఎన్‌ఎస్‌ తెలిపింది. షార్ప్‌ టంగ్‌ పేరిట ఏర్పడిన ఈ గ్రూపు జీమెయిల్‌, ఏఓఎల్‌ కంటెంట్‌ను సంగ్రహిస్తోంది.


కిమ్‌సుకీ పేరిట బైటకు వస్తున్న దీని మూలం ఉత్తర కొరియాలో ఉందని సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ రీసెర్చర్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘ఒలెక్సిటీ’కి చెందినట్టు ఐఏఎన్‌ఎస్‌ పేర్కొంది. అమెరికా, యూరప్‌నకు చెందిన వ్యక్తులు సంస్థలను ఈ షార్ప్‌టంగ్‌ టార్గెట్‌ చేస్తోంది. దక్షిణ కొరియా అలాగే అక్కడి న్యూక్లియర్‌ విషయాలు, ఆయుధ వ్యవస్థలు, ఇతర వ్యూహాత్మక అంశాలపరంగా గూఢచర్యం అంతా సాగుతోంది. 

Updated Date - 2022-08-06T06:00:27+05:30 IST