ఈ నెలలోనే భారత్‌లో కోవిడ్19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్

ABN , First Publish Date - 2020-09-08T17:23:14+05:30 IST

ప్రపంచంమంతా కరోనా మహమ్మారి బారినపడి తల్లడిల్లిపోతోంది. కాగా భారత్‌తో సహా పలు దేశాలలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.

ఈ నెలలోనే భారత్‌లో కోవిడ్19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్

న్యూఢిల్లీ: ప్రపంచంమంతా కరోనా మహమ్మారి బారినపడి తల్లడిల్లిపోతోంది. కాగా భారత్‌తో సహా పలు దేశాలలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరబ్, ఫిలిప్పీన్స్, భారత్, బ్రెజిల్ తదితర దేశాలలో ఈ నెలలోనే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 



గత ఆగస్టు 26 నుంచి వ్యాక్సిన్ అధ్యయనాన్ని ప్రారంభించమని, దీనిలో 40 వేలకు పైగా జనాభా భాగస్వాములయ్యారన్నారు. మూడవ దశ ట్రయల్‌కు సంబంధించిన పూర్తి ఫలితాలు అక్టోబరు- నవంబరు నాటికి వస్తాయన్నారు. భారత్‌లో స్పుత్నిక్ విని స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు రష్యా, భారత ప్రభుత్వాలు, దేశంలోని ప్రముఖ కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. 

Updated Date - 2020-09-08T17:23:14+05:30 IST