రష్యా టీకా ట్రయల్స్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2020-10-30T10:11:18+05:30 IST

డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ర

రష్యా టీకా ట్రయల్స్‌ నిలిపివేత

మాస్కో, అక్టోబరు 29: డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది. ప్రస్తుతం 40 వేల మంది వాలంటీర్లపై మూడో దశ ట్రయల్స్‌ను మాస్కోలోని ఎనిమిది ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-10-30T10:11:18+05:30 IST