మొలకెత్తెను ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-09-08T05:30:00+05:30 IST

రోజులో బ్రేక్‌ఫాస్ట్‌ కీలకం. రాత్రంతా కడుపు ఖాళీ ఉండటంతో శరీరానికి శక్తి కావాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు తినడం లేదా రాత్రిపూట తినడం ఆరోగ్యానికి మంచిదే...

మొలకెత్తెను ఆరోగ్యం

రోజులో బ్రేక్‌ఫాస్ట్‌ కీలకం. రాత్రంతా కడుపు ఖాళీ ఉండటంతో శరీరానికి శక్తి కావాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు తినడం లేదా రాత్రిపూట తినడం ఆరోగ్యానికి మంచిదే. 


శనగలు, పెసలు, శనక్కాయలు, అలసందలు.. లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తిన విత్తనాలు తయారవుతాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తినాలనుకున్నపుడు వీటితోనే సరిపెట్టుకోవచ్చు. కడుపు నిండుతుంది. ఫైబర్‌ శాతం అధికంగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతాయి కూడా. 


ఐరన్‌, కాపర్‌ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి కూడా ఉపకరిస్తాయి. డైటింగ్‌ చేసేవారు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు మొలకెత్తిన విత్తనాలతో  దోస్తీ చేయాల్సిందే. 


మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్‌ శాతం ఎక్కువే. ఎ- విటమిన్‌ పుష్కలం కాబట్టి ఇవి తింటే కంటికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, పొటాషియం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎంజైమ్‌ల పవర్‌ హౌస్‌ అయిన ఈ మొలకెత్తిన విత్తనాలను గర్భిణులు, పిల్లలు తప్పక తినాలి.

Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST