మొలకెత్తాయి

ABN , First Publish Date - 2021-06-14T05:08:00+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురుస్తుండటం

మొలకెత్తాయి
యాచారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మొలకెత్తిన్న వడ్లు

  • చింతపట్ల యాచారం కొనుగోలు కేంద్రాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మొలకెత్తిన ధాన్యం 
  • వడ్లను కొనుగోలు చేయని  కేంద్రాల నిర్వాహకులు 
  • సెంటర్ల వద్ద  ధాన్యంతో రైతుల పడిగాపులు 


యాచారం :  రంగారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురుస్తుండటం రైతులకు ఒక పక్క ఆనందం, మరో పక్క విషాదం కలుగుతోంది. పలు చోట్ల రైతులు వరి నారుమళ్లు పోసుకొని, తొలకరి దుక్కులు దున్నుతున్నారు. మెట్ట పైర్లకు విత్తనాలు వేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో  ధాన్యం అమ్ముడుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యాన్ని పెట్టుకొని ఎప్పుడు అమ్ముడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. యాచారం, చింతపట్ల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వివిధ గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చారు.  15రోజులుగా కేంద్రాల్లోని ధాన్యం వానకు తడుస్తూ మొలకెత్తుతోంది. చింతపట్లలో బండ పర్వతాలుకు చెందిన ధాన్యం కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో వానకు తడిసి మొలకెత్తింది. యాచారం మండల కేంద్రంలో భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.  



Updated Date - 2021-06-14T05:08:00+05:30 IST