Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాఠశాలలో పారుతున్న ఊటనీరు

గాండ్లపెంట,  డిసెంబరు 3: మండల పరిధిలోని కటకంవారిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఊటనీరు వెళ్ళడంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. మండల వ్యాప్తం గా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పాఠశాల ఆవరణలో ఊటనీరు ప్రవహి స్తున్నాయి. అంతే కాకుండా చెరువుకు లోతట్టు ప్రాంతంలో తరగతి గదులు నిర్మిం చడంతో నీరు పాఠశాల ఆవరణలో నిలిచిపోయాయి. దీంతో బురదమయమై విద్యార్థులు తరగతి గదు ల్లోకి వెళ్ళాలంటే బురద తొక్కుతూ వెళ్ళాల్సి వస్తోంది. అంతే కాకుండా అక్కడే అంగన్‌ వాడీ కేంద్రం కూడా ఉంది. దీంతో చిన్న పిల్లలు మరింత ఇబ్బందులు ఎదుర్కొ వాల్సి వస్తోంది. ఈ పాఠశాలలో 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు 36 మంది, అంగన్‌వాడీ కేంద్రంలో 18 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఊటనీరు తొలగించి, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని విద్యార్థుల త ల్లిదండ్రులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement