విజేతలైన బాల, బాలికల జట్లుకు ట్రోఫీలు అందజేస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
గుంటూరు(క్రీడలు), జనవరి23: పేరేచర్లలో జరుగుతున్న రాష్ట్ర అంతర్ జిల్లాల అండర్ -16 బాల, బాలికల ఆట్యా- పాట్యా ఛాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా బాల, బాలికల జట్లు ప్రథమస్థానం కైవసం చేసుకున్నాయి. బాలుర విభాగంలో పశ్చిమ గోదావరి, బాలికల విభాగంలో నెల్లూరు జట్లు రెండోస్థానంలో నిలిచాయి. విజేతలకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు బహుమతులు అందజేశారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శాప్ అడ్మిన్ ఆఫీసర్ శివరామకృష్ణ, చీఫ్ కోచ్ మురళీధర్, సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటేశ్వర్లు, ప్రసాదు, జిల్లా కార్యదర్శి రామసీతమ్మ తదితరులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.