అథ్లెటిక్స్‌ మీట్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు

ABN , First Publish Date - 2021-01-25T06:38:21+05:30 IST

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మీట్‌లో విశాఖ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాల్తేరు రైల్వే అథ్లెటిక్స్‌ అకాడమీ అథ్లెట్లు పతకాలు సాధించారు.

అథ్లెటిక్స్‌ మీట్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు
పతకాలు సాధించిన అథ్లెట్లతో డీఆర్‌ఎం, స్పోర్ట్సు ఆఫీసర్లు

అభినందించిన డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ

విశాఖపట్నం(స్పోర్ట్సు), జనవరి 24: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మీట్‌లో విశాఖ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాల్తేరు రైల్వే అథ్లెటిక్స్‌ అకాడమీ అథ్లెట్లు పతకాలు సాధించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈ మీట్‌లో బాలికల అండర్‌-20 కేటగిరీలో శ్రీలక్ష్మి అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఐదు కిలోమీటర్ల పరుగులో స్వర్ణ పతకం, 1500 మీ. పరుగులో కాంస్య పతకం సొంతం చేసుకోగా... బాలికల అండర్‌-14 షాట్‌పుట్‌లో అయేషభాను స్వర్ణ పతకం,  అండర్‌-16 విభాగం 80మీ. హర్డిల్స్‌లో అరుణ సరోజ రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం రైల్వే గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో వాల్తేరు  డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ హాజరై పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించారు. వాల్తేరు రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్‌ జాయింట్‌ స్పోర్ట్సు ఆఫీసర్‌ మహేష్‌ మద్దిరెడ్డి, అసిస్టెంట్‌ స్పోర్ట్సు ఆఫీసర్లు హరినాఽథ్‌, అవినాష్‌, ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు, రైల్వే అథ్లెటిక్స్‌ కార్యదర్శి పి.శ్రీనివాసరావు, కృష్ణంరాజు తదితరులు చిన్నారులను అభినందించారు.

Updated Date - 2021-01-25T06:38:21+05:30 IST