క్రీడలతో మానసిక వికాసం

ABN , First Publish Date - 2021-01-16T05:17:49+05:30 IST

శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మార్కాపురం ఎ మ్మెల్యే కె.నాగార్జునరెడ్డి అన్నారు.

క్రీడలతో మానసిక వికాసం
క్రీడాకారులతో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి తదితరులు

ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

హనుమంతునిపాడు, జనవరి 15: శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని మార్కాపురం ఎ మ్మెల్యే కె.నాగార్జునరెడ్డి అన్నారు. సం క్రాంతి పండుగ సందర్భంగా మండల పరిధిలోని వేములపాడులో శుక్రవారం నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్‌ పేరు మీద క్రీడలు నిర్వహిం చడం అభినందనీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివా సులరెడ్డి మాట్లాడుతూ క్రీడలు ప్రజల్లో ఐకమత్యాన్ని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని చె ప్పారు. అనంతరం పోటీ ల్లో గెలుపొందిన ప్రథ మ, ద్వితీయ విజేతలు చినమనగుండం, వేము లపాడు జట్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్రోఫీని అందించారు. 

కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బలరామిరెడ్డి, ఈశ్వరమ్మ, గుంటక ర మణారెడ్డి, వైసీపీ నాయకులు యక్కంటి శ్రీనివాసరెడ్డి, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-16T05:17:49+05:30 IST