నేషనల్స్‌ స్విమ్మింగ్‌ చాంప్‌లో జిల్లా సత్తా

ABN , First Publish Date - 2021-10-20T06:16:29+05:30 IST

బెంగళూరులోని బసవన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ప్రారంభమైన 37వ సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో జిల్లా స్విమ్మర్ల మంగళవారం సత్తాచాటారు.

నేషనల్స్‌ స్విమ్మింగ్‌ చాంప్‌లో జిల్లా సత్తా

భవానీపురం, అక్టోబరు 19 : బెంగళూరులోని బసవన్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ప్రారంభమైన 37వ సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో జిల్లా స్విమ్మర్ల మంగళవారం సత్తాచాటారు. ఎం.యజ్ఞసాయి సబ్‌ జూనియర్‌ గ్రూప్‌-3 విభాగంలో 200 మీటర్లు ఫ్రీ స్టయిల్‌లో 2:20:71 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి స్వర్ణం, గ్రూప్‌-4లో 200 మీ టర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్‌లో 9 ఏళ్ల కె.లాస్య శ్రీ 3:12:25 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం సాధించింది. తొలిరోజు పతకాల సాధనలో స్విమ్మర్లు సత్తా చాటడంపై జిల్లా స్వి మ్మింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమేష్‌ అభినందించారు.

Updated Date - 2021-10-20T06:16:29+05:30 IST