Abn logo
Sep 21 2021 @ 00:39AM

మల్లకంబ్‌ విజేత ‘పశ్చిమ’

ఓవరాల్‌ ఛాంప్‌గా నిలిచిన పశ్చిమ జట్టుతో ఎమ్మెల్యే గ్రంధి

భీమవరం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 20 : మల్లకంబ్‌ క్రీడ ప్రాచీనమైనదని, క్రీడకు ప్రోత్సాహం ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఎల్‌హెచ్‌ టౌన్‌ హాల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి మల్లకంబ్‌ ఛాంపియన్‌షిప్‌ ముగింపు సోమవారం రాత్రి నిర్వహించారు. 8 జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీలలో పాల్గొనగా ఓవరాల్‌ ఛాంపియన్‌గా పశ్చిమ గోదావరి, రెండో స్ధానంలో గుంటూరు జిల్లా, మూడో స్థానంలో చిత్తూరు నిలిచాయి. ఈ నెల 26  నుంచి  మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి  పోటీలలో విజేతలు, జూనియర్‌, సబ్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాలలో పాల్గొంటారు. విజేతలకు పతకాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అందించారు.  ప్రాచీన క్రీడలను పోత్సహిస్తున్న టౌన్‌హాల్‌ను అభినందించారు.  టౌన్‌హాల్‌ అధ్యక్షుడు  మెంటే పార్థసారథి, కార్యదర్శి కామన నాగేశ్వరరావు, టౌన్‌ హాల్‌ ఉపాధ్యక్షుడు మల్లినీడి తిరుమలరావు (బాబి), గ్రంధి సురేష్‌, శ్రీనివాసరాజు, అల్లు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.