Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఫైనల్లో తెలంగాణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న జాతీయ జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ చివరి దశకు చేరింది. శనివారం జరగనున్న గ్రాండ్‌ ఫైనల్‌లో మహారాష్ట్రతో తెలంగాణ తలపడనుంది. ఇక, ఇక్కడే జరుగుతున్న బాలుర పోటీల్లో ఆంధ్ర జట్టు ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో రాజస్థాన్‌తో ఆంధ్ర అమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement
Advertisement