Advertisement
Advertisement
Abn logo
Advertisement

బోణీ అదరాలి

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు

అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌

సా. 6.30 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌లో


జార్జ్‌టౌన్‌: అండర్‌-19 వన్డే వరల్డ్‌క్‌పలో యువ భారత్‌  శనివారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. తమ గ్రూప్‌-బిలో బలంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌ ద్వారా శుభారంభం చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు విశ్వక్‌పను సొంతం చేసుకున్న భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. అయితే, జట్టులోని ఆటగాళ్లందరికి ఇదే తొలి వరల్డ్‌కప్‌ కావడంతో కుర్రాళ్లకు ఇదొక సవాలే. కెప్టెన్‌ యష్‌ ధుల్‌తో పాటు గుంటూరు యువ బ్యాటర్‌,  వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌, ఫామ్‌లో ఉన్న హర్నూర్‌ సింగ్‌ చెలరేగితే భారత్‌కు ఎదురుండదు. పేసర్లు హంగార్గేకర్‌,  రవికుమార్‌ బౌలింగ్‌ దళాన్ని నడిపించనున్నారు. దేశవాళీ క్రికెట్‌ను ఒక ఊపు ఊపుతున్న ఆల్‌రౌండర్‌ రాజ్‌ భవాపై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక, 2014లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. మరోసారి అలాంటి ప్రదర్శనను చూపేందుకు ఆ జట్టు కసరత్తు చేస్తోంది. 

Advertisement
Advertisement