Advertisement
Advertisement
Abn logo
Advertisement

సౌతాఫ్రికాలో ఐపీఎల్‌?

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విజృంభణతో దేశంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఏప్రిల్‌ నాటికి కొవిడ్‌ మూడో వేవ్‌ తగ్గుముఖం పట్టకపోతే వచ్చే ఐపీఎల్‌ను భారత్‌ వెలుపల నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయ వేదికగా సౌతాఫ్రికా పట్ల బోర్డు ప్రధానంగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దక్షిణాఫ్రికా కానిపక్షంలో శ్రీలంకను ఎంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. భారత్‌లో సాధారణ ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్‌ జరిగిన సంగతి తెలిసిందే. 


లీగ్‌లో ఆడాలనుంది: రూట్‌

ఐపీఎల్‌లో ఆడాలనుకుంటున్నట్టు ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ జో రూట్‌ తెలిపాడు. 2018 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన రూట్‌.. వచ్చే నెలలో జరిగే మెగా ఆక్షన్‌లో తన పేరును నమోదు చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా సుదీర్ఘ విరామం తర్వాత మెగా లీగ్‌కు తిరిగి రావాలనుకుంటున్నట్టు తెలిపాడు.

Advertisement
Advertisement