యువ సమరం

ABN , First Publish Date - 2022-01-14T09:14:27+05:30 IST

యువ సమరం

యువ  సమరం

నేటి నుంచే అండర్‌-19 వన్డే  ప్రపంచకప్‌ 

ఫేవరెట్‌గా భారత్‌


జార్జ్‌టౌన్‌ (గయానా): మరో మెగా టోర్నీకి వేళైంది. ప్రపంచ యువ క్రికెటర్లంతా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 16 జట్లు తలపడుతున్న ఐసీసీ అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్‌ వెస్టిండీస్‌ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి కరీబియన్‌ దీవులు ఈ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యం ఇస్తున్నాయి. గయానా, ఆంటిగ్వా, సెయింట్‌ కిట్స్‌, ట్రినిడాడ్‌లలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జట్లన్నీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన జట్లు ప్లేట్‌ దశలో పోటీపడతాయి. ఫిబ్రవరి 5న నార్త్‌సౌండ్‌లోని సర్‌ వివియన్‌ రిచర్డ్‌ స్టేడియంలో ఫైనల్‌ నిర్వహిస్తారు.

రేపే మన పోరు: నాలుగుసార్లు చాంపియన్‌ యువ భారత్‌ (2000, 2008, 2012, 2018) మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఢిల్లీకి చెందిన యష్‌ ధుల్‌ కెప్టెన్సీలో భారత్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగు క్రికెటర్‌ రషీద్‌  వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం విశేషం. 15న సౌతాఫ్రికాతో పోరుతో భారత్‌ టోర్నీని ప్రారంభిస్తుంది. ఇక మొదటి రోజు వెస్టిండీ్‌స-ఆస్ట్రేలియా (గయానా), శ్రీలంక-స్కాట్లాండ్‌ (జార్జ్‌టౌన్‌) ఢీకొంటాయి. 

భారత జట్టు: యష్‌ ధుల్‌ (కెప్టెన్‌), ఎస్‌కే రషీద్‌ (వైస్‌కెప్టెన్‌), హర్నూర్‌ సింగ్‌, రఘువంశీ, నిషాంత్‌ సింధు, సిద్ధార్థ్‌ యాదవ్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, దినేశ్‌ బనా, ఆరాధ్య యాదవ్‌, రాజ్‌ బవా, మానవ్‌ పరఖ్‌, కౌశల్‌ తంబె, హంగ్రేకర్‌, వాసు వాట్స్‌, వికీ ఓస్వాల్‌, రవికుమార్‌, సంగ్వన్‌.


గ్రూపులు

ఎ - బంగ్లాదేశ్‌, కెనడా, ఇంగ్లండ్‌, యూఏఈ

బి - భారత్‌, ఐర్లాండ్‌, సౌతాఫ్రికా, ఉగాండ

సి - అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, న్యూగినీ, జింబాబ్వే

డి- ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌


నేటి మ్యాచ్‌లు

వెస్టిండీస్‌ గీ ఆస్ట్రేలియా

సా.6.30 నుంచి 

వేదిక: గయాన

శ్రీలంక గీ స్కాట్లాండ్‌

సా.6.30 నుంచి 

వేదిక: జార్జ్‌టౌన్‌

స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం


భారత్‌ షెడ్యూల్‌

జనవరి 15న దక్షిణాఫ్రికాతో  

జనవరి 19 ఐర్లాండ్‌తో 

జనవరి 22

ఉగాండతో 

Updated Date - 2022-01-14T09:14:27+05:30 IST