కళ్లన్నీ రాహుపైనే!

ABN , First Publish Date - 2022-08-18T13:17:17+05:30 IST

కళ్లన్నీ రాహుపైనే!

కళ్లన్నీ రాహుపైనే!

నా ప్రదర్శనను మరచిపోలేదురెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా.. రెండేళ్ల నా ప్రదర్శనను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరచిపోలేదు. మంచి ఆటగాడి నుంచి గొప్ప ప్లేయర్‌గా ఎదగడానికి అనువైన వాతావరణం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంది. ఓ ప్లేయర్‌కు కెప్టెన్‌, కోచ్‌, మేనేజ్‌మెంట్‌ అండగా నిలవడం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. ప్రతి ఒక్కరికీ తమ సహజ రీతిలో ఆడే స్వేచ్ఛనిస్తాను.- కేఎల్‌ రాహుల్‌


హరారే: మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో.. వన్డేలను కూడా పొట్టి ఫార్మాట్‌ దృష్టితోనే చూస్తున్నారు. ఈ క్రమంలో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌ ధనాధన్‌ ఆటతో అదరగొట్టాలని చూస్తోంది. కాగా, టీ20 వరల్డ్‌క్‌పలో కీలక ఆటగాడిగా భావిస్తున్న కేఎల్‌ రాహుల్‌పైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత శస్త్ర చికిత్స, కొవిడ్‌ బారినపడిన రాహుల్‌కు ఈ సిరీస్ లో రాణించడం ఎంతో కీలకం. రెండు నెలలకుపైగా ఆటకు దూరంగా ఉన్న అతడు.. ఫిట్‌నె్‌సతోపాటు ఫామ్‌ను నిరూపించుకొంటే వరల్డ్‌క్‌పలో టీమిండియాకు ఓపెనర్‌ సమస్య తీరుతుంది. ఆసియా కప్‌లో ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ ఆట గాడినపడాలని రోహిత్‌ శర్మ, కోచ్‌ ద్రవిడ్‌ ఆశిస్తున్నారు.


కాగా, సీనియర్లకు విశ్రాంతి నివ్వడంతో.. రాహుల్‌ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ద్వితీయ శ్రేణి జట్టుకు ఆతిథ్య జింబాబ్వే నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ధవన్‌, గిల్‌, రాహుల్‌, దీపక్‌ హుడాలతో టీమిండియా బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. సిరాజ్‌, శార్దూల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, దీపక్‌ చాహర్‌లతో కూడిన బౌలింగ్‌ విభాగం ఎంత మేరకు రాణిస్తుందో చూడాలి. సత్తాచాటడానికి కుల్దీప్‌ యాదవ్‌కు ఇదో సువర్ణావకాశం కాగా.. గాయం నుంచి కోలుకొన్న చాహర్‌ కూడా ఈ సిరీస్‌ ఎంతో ముఖ్యం.


జోష్‌లో చికాబ్వా  సేన..: మరోవైపు బంగ్లాదేశ్‌పై భారీ స్కోర్లను ఛేదించిన ఆత్మవిశ్వాసంలో ఉన్న చికాబ్వా సేన.. భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది. సికందర్‌ రజా, చికాబ్వా, ఇన్నోసెంట్‌ కయా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కానీ, బంగ్లా కంటే ఎంతో మెరుగైన టీమిండియా బౌలింగ్‌ను వీరు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తంగా చూస్తే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 


జట్లు (అంచనా)భారత్‌: ధవన్‌, గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌/దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌/అవేశ్‌ ఖాన్‌.జింబాబ్వే: తకుండ్జ్‌వనషే కైటానో, మరుమణి, కైయా, వెస్లీ, సికందర్‌ రజా, చకాబ్వా (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ర్యాన్‌ బర్ల్‌/టోనీ మన్యోంగా, లూక్‌ జాంగ్‌వి, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ ఎన్‌యౌచి, తనాక చివాంగ. 


పిచ్‌/వాతావరణంహరారే వికెట్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇటీవలే బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, ఉదయం పేసర్లకు కొంత అనుకూలించే అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉండనుంది. 


భారత్‌-జింబాబ్వే మధ్య జరిగిన 8 ద్వైపాక్షిక సిరీ్‌సల్లో ఏడుసార్లు టీమిండియా గెలిస్తే, 1996-97లో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే నెగ్గింది. హరారే పిచ్‌పై ఆడిన 16 వన్డేల్లో భారత్‌పై జింబాబ్వే రెండుసార్లు మాత్రమే గెలిచింది. జింబాబ్వేలో కేఎల్‌ రాహుల్‌ వన్డే అరంగేట్రం చేయగా.. అక్షర్‌, శాంసన్‌ తమ తొలి టీ20 మ్యాచ్‌లు ఇక్కడే ఆడారు. 


Updated Date - 2022-08-18T13:17:17+05:30 IST