గ్రామీణ ప్రాంత క్రీడలకు జడ్పీ నిధులు

ABN , First Publish Date - 2022-01-22T05:06:32+05:30 IST

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జడ్పీ తరపున 4 శాతం నిధులను క్రీడలకు ఖర్చు చేయనున్నట్లు జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ తెలిపారు.

గ్రామీణ ప్రాంత క్రీడలకు జడ్పీ నిధులు
పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్‌

బుట్టాయగూడెం, జనవరి 21: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జడ్పీ తరపున 4 శాతం నిధులను క్రీడలకు ఖర్చు చేయనున్నట్లు జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ తెలిపారు. బుట్టాయగూడెం జూనియర్‌ కళాశాల ఆవరణలో టీబీఆర్‌ సంస్థ నిర్వహించే ఆటల పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. మూడేళ్లుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కార్యక్రమం లో జడ్పీ విప్‌ సూరిబాబు, ఏఎంసీ చైర్మన్‌ కరాటం సీతాదేవి, ఎంపీపీ కారం శాంతి, జడ్పీటీసీ మొడియం రామతులసీ, కుక్కల వరలక్ష్మి, గుగ్గులోతు మోహనరావు, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:06:32+05:30 IST